: సోనియా గాంధీకి క్షమాపణలు చెప్పిన పీసీ చాకో


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఘోరపరాభవం ఎదుర్కోవడంపై ఆ పార్టీ నేతలు దిగ్భ్రాంతి చెందారు. అసెంబ్లీలో ఉనికిని కూడా కాపాడుకోలేకపోవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పనితీరు పట్ల ఆ పార్టీ అధినేత్రి సోనియా గాంధీకి కాంగ్రెస్ సీనియర్ లీడర్ పీసీ చాకో క్షమాపణలు చెప్పారు. ఢిల్లీ ప్రజల మనోభావాలను అంచనా వేయలేకపోయామని ఆయన పేర్కొన్నారు. సార్వత్రిక ఎన్నికల నుంచి కాంగ్రెస్ పార్టీకి ఘోరపరాభవాలు ఎదురవుతున్నాయి. పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రాతినిధ్యం కూడా లేకపోవడం విశేషం. దీంతో ఆ పార్టీ కార్యకర్తలు 'ప్రియాంకను తీసుకురండి, పార్టీని బతికించండి' అంటూ ప్రదర్శనలు చేస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News