: ఎస్సీ వర్గీకరణ రాష్ట్రం పరిధిలోది కాదు: ఏపీ మంత్రి రావెల


ఎస్సీ వర్గీకరణ అంశం రాష్ట్ర పరిధిలోనిది కాదని ఏపీ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు స్పష్టం చేశారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, ఎస్సీ వర్గీకరణ కేంద్రం పరిధిలోని అంశమని తెలిపారు. ఎస్సీ వర్గీకరణ చేపట్టాలంటూ మంత్రులను ఆడ్డుకోవడం సరికాదని ఆ సామాజిక వర్గానికి ఆయన హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాల, మాదిగలకు సమ ప్రాధాన్యం ఇస్తుందని ఆయన పేర్కొన్నారు. కాగా, గత కొంత కాలంగా ఎన్నికల ముందు ఇచ్చిన హామీ ప్రకారం ఎస్సీ వర్గీకరణ చేపట్టాలని మంత్రులను మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతలు అడ్డుకుంటున్న విషయం తెలిసిందే.

  • Loading...

More Telugu News