: పంజాబ్ లో అంబరాన్నంటిన ఆప్ సంబరాలు


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించడంతో పంజాబ్ రాజధాని చండీగఢ్ లో ఆప్ కార్యకర్తలు సంబరాల్లో మునిగిపోయారు. భారీ సంఖ్యలో ఆప్ కార్యాలయానికి చేరుకున్న కార్యకర్తలు పెద్దఎత్తున బాణసంచా కాల్చారు. చండీగఢ్ తో పాటు వివిధ ప్రాంతాల్లోని ఆప్ కార్యకర్తలు పార్టీ విజయం సాధించడంతో మిఠాయిలు పంచారు. ఆప్ అపూర్వ విజయం సాధించిందని, అందుకే వేడుకలు చేసుకుంటున్నామని పార్టీ శ్రేణులు పేర్కొన్నాయి. విద్యార్థులకు పెన్నులు, పుస్తకాలు...వృద్ధులకు దుప్పట్లు, బట్టలు, ఆహారం పంచామని పంజాబ్ ఆప్ రాష్ట్ర నేత అహ్బబ్ సింగ్ చెప్పారు.

  • Loading...

More Telugu News