: కార్యకర్తలే కొంపముంచారంటున్న కిరణ్ బేడీ భర్త


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ పరాజయం పాలైన సంగతి తెలిసిందే. కృష్ణానగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన ఆమెపై ఎస్.కె.బగ్గా నెగ్గారు. అయితే కిరణ్ బేడీ... తాను ఓటమిపాలవ్వలేదని, బీజేపీనే ఓడిపోయిందని మధ్యాహ్నం తర్వాత కొత్త సిద్ధాంతం తెరమీదికి తేగా, ఆమె భర్త బ్రిజ్ బేడీ కార్యకర్తలే కొంపముంచారంటూ మండిపడుతున్నారు. కిరణ్ కు వారు సరైన మద్దతు ఇవ్వలేదని ఆరోపించారు. "కార్యకర్తలు పూర్తిగా సహకరించి ఉంటే ఆమె ఎందుకు నెగ్గదు?" అని ఆగ్రహంతో ప్రశ్నించారు. కిరణ్ బేడీ గెలిచి ఉంటే ఢిల్లీ వాసులకు నవ్యరీతిలో పాలన అందించేవారని అన్నారు. ఢిల్లీ యువత యావత్తూ ఆప్ కు మద్దతు పలికి ఉంటుందని భావిస్తున్నట్టు తెలిపారు.

  • Loading...

More Telugu News