: ఓడింది నేను కాదు, బీజేపీనే!: మాట మార్చిన కిరణ్ బేడీ


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చావుదెబ్బతిని విలవిల్లాడుతున్న బీజేపీ పుండుపై ఆ పార్టీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీ కారం చల్లారు. బీజేపీ గెలిచినా, ఓడినా తనదే బాధ్యత అంటూ ఇంతకుముందు ప్రకటించిన కిరణ్ బేడీ... ఇప్పుడు హఠాత్తుగా మాట మార్చారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడింది తాను కాదని... బీజేపీనే అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. జాతీయ పార్టీ అయిన బీజేపీ... ఈ దారుణ ఓటమికి కారణాలు ఏమిటన్నది శోధించాలని, ఆత్మ పరిశీలన చేసుకోవాలని సూచించారు.

  • Loading...

More Telugu News