: ఆప్ చేసి చూపుతోంది


స్వచ్ఛ బారత్ అని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. పిలుపునిచ్చిన సందర్భంగా ఆయన ఒకట్రెండు సార్లు దానికోసం చీపురు పట్టారు. బీజేపీ నేతలు దానిని అప్పుడప్పుడు కొనసాగిస్తున్నారు. ఢిల్లీలో విజయం సాధించిన ఆప్ తన చిత్తశుద్ధిని చూపెడుతోంది. ఢిల్లీ ఎన్నికల్లో 67 సీట్లతో చరిత్రాత్మక విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీ సంబరాల్లో మునిగి తేలింది. పార్టీ కార్యాలయం, ఆప్ అభ్యర్థుల నివాసాల్లో టపాసులు పేలాయి, రంగులు విరజల్లి చిందేశారు. సంబరాలు ముగిసిన తరువాత ఆయా ప్రదేశాల్లో చెత్త పేరుకుపోయింది. దీనిని చూసిన ఆప్ కార్యకర్తలు తమ పార్టీ గుర్తుతో ముందుకురికారు. నేత, కార్యకర్త అన్న తేడా లేకుండా అంతా చీపుర్లతో చెత్తను శుభ్రం చేశారు. అంతా పోగేసి, డస్ట్ బిన్ లలోకి చేర్చి శుభ్రం చేసి తమ ప్రత్యేకత చాటుకున్నారు.

  • Loading...

More Telugu News