: జపాన్ కు మరోసారి ఎల్ నినో ముప్పు
జపాన్ ను మరోసారి ఎల్ నినో కుదిపేసే అవకాశం ఉందని ఆ దేశ వాతావరణ సంస్థ తెలిపింది. ఈ ఏడాది వేసవిలో ఎల్ నినో సంభవించే అవకాశం 50 శాతం ఉందని స్పష్టం చేసింది. ఈ సారి ఎల్ నినో వస్తే గత ఐదేళ్లలో ఇది రెండో సారి అవుతుంది. ఎల్ నినో కారణంగా ఫసిఫిక్ మహా సముద్రంలో ఉపరిత జలం తీవ్రంగా వేడెక్కడం వల్ల ఆగ్నేయాసియాలో కరువు తాండవిస్తుంది. దక్షిణ అమెరికాలో వరదలు సంభవించి పంటలకు తీవ్ర నష్టం కలుగుతుంది. దీంతో సరిపడా ఆహార ధాన్యాలు లభించక ఇబ్బందులు తలెత్తే ప్రమాదం ఉంది. దీంతో మరోసారి ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక మాంద్యం ఏర్పడే అవకాశం ఉంటుందని ఆ సంస్థ ఆందోళన వ్యక్తం చేసింది.