: అరవింద్ కేజ్రీవాల్ కు 'జెడ్' కేటగిరి భద్రత
కాబోయే ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు భద్రత కల్పించనున్నట్టు ఢిల్లీ పోలీసులు తెలిపారు. ఆయన రక్షణ కోసం దాదాపు 30 మంది కమెండోలను కేటాయించనున్నట్టు ఓ పోలీస్ అధికారి చెప్పారు. ఆప్ శాసనసభాపక్ష నేతగా కేజ్రీవాల్ ఎన్నికైన వెంటనే ప్రొటోకాల్ ప్రకారం 'జెడ్' కేటగిరి భద్రత కల్పిస్తామని వివరించారు. ప్రస్తుతం గజియాబాద్ లో నివాసం ఉంటున్న కేజ్రీకి 12 మంది పోలీసులు భద్రత ఇస్తున్నారు. ఢిల్లీ ఎన్నికల్లో అపూర్వ విజయాన్ని సొంతం చేసుకుని సీఎం కాబోతున్నారు కాబట్టి భారీ భద్రత ఇవ్వనున్నారు.