: సోషల్ మీడియాలో కేజ్రీకి వెల్లువెత్తిన అభిమానం... మోదీపై సెటైర్లు


సోషల్ మీడియాలో అరవింద్ కేజ్రీవాల్ కి అభిమానం వెల్లువెత్తింది. ఢిల్లీలో ఏకపక్షంగా విజయం సాధించిన ఆమ్ ఆద్మీ పార్టీకి శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతిఒక్కరూ పోస్టులు పెడుతున్నారు. ట్విట్టర్, ఫేస్ బుక్ లలో ఆమ్ ఆద్మీ పార్టీకి, అరవింద్ కేజ్రీవాల్ కు శుభాకాంక్షలు తెలుపుతూ తమ అభిమానం చాటుకుంటున్నారు. మరి కొందరు ఔత్సాహికులు కాంగ్రెస్, బీజేపీలపై సెటైర్లు వేస్తున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ మూటాముల్లె సర్దేసుకుని పలాయనం చిత్తగించాలని కొందరు సూచిస్తుండగా, స్వచ్ఛభారత్ లో భాగంగా ఢిల్లీ ఓటర్లు మోదీని ఊడ్చిపారేశారని మరి కొందరు పేర్కొంటున్నారు. తాజా ఫలితాలతో రాజధానిలో మోదీ హవా, అమిత్ షా మ్యాజిక్ ఏమీ లేదని, ప్రజలు ప్రతి విషయాన్ని గమనిస్తున్నారన్నది దీంతో స్పష్టమైందని, కేవలం కాంగ్రెస్ చేసిన తప్పిదాలే ఆ పార్టీ నామరూపాల్లేకుండా పోవడానికి కారణమయ్యాయని పలువురు విశ్లేషిస్తున్నారు. మరి కొందరు మరింత ముందుకెళ్లి... 'చాయ్ వాలాని, నల్లకుబేరుల పేర్లు బయటపెడతా' అంటూ అధికారంలోకి వచ్చిన మోదీ లక్షలు పెట్టి సూట్లు కుట్టించుకోవడం కూడా ఓ కంటకనిపెడుతున్నారని పేర్కొంటున్నారు.

  • Loading...

More Telugu News