: కాంగ్రెస్ కు బీజేపీ ఇవ్వనిదాన్ని.... బీజేపీకి ఇస్తామన్న ఆప్


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో చచ్చీ, చెడీ మూడు సీట్లను గెలుచుకోబోతున్న బీజేపీకి ప్రతిపక్ష హోదా కల్పిస్తామని ఆప్ తెలిపింది. వాస్తవానికి 70 సీట్లు ఉన్న ఢిల్లీ శాసనసభలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే, కనీసం 7 స్థానాలనైనా (10 శాతం) కైవసం చేసుకోవాలి. అయితే, ప్రజాసమ్మతంపై ప్రజాస్వామ్యం నడుస్తుందని, అందుకే అవసరమైన స్థానాలను బీజేపీ సాధించలేని పరిస్థితుల్లో కూడా, ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా కల్పిస్తామని ఆప్ కీలక నేత కుమార్ విశ్వాస్ స్పష్టం చేశారు. ప్రభుత్వానికి సంబంధించిన వివిధ కీలకమైన కమిటీలలో ప్రతిపక్ష నేతకు కూడా స్థానం ఉంటుంది. దీంతో, ఈ పదవి అత్యంత ప్రధానమైనది. మరోవైపు లోక్ సభలో 44 సీట్లకే పరిమితమైన కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇచ్చేందుకు బీజేపీ నిరాకరించిన సంగతి తెలిసిందే. చివరకు సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడంతో, విపక్షానికి చెందిన ఓ సభ్యుడికి ఈ కమిటీలలో ప్రాతినిధ్యం వహించేందుకు ఎన్డీయే ప్రభుత్వం అనుమతించింది.

  • Loading...

More Telugu News