: ఆఫ్ఘనిస్థాన్ పై బ్యాట్లు ఝుళిపించారు!


ఆఫ్ఘనిస్తాన్ జట్టుతో వార్మప్ మ్యాచ్ లో టీమిండియా భారీ స్కోరు సాధించింది. రోహిత్ శర్మ (150) సెంచరీ నమోదు చేయగా, రహానే (88 నాటౌట్), రైనా (75) రాణించడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్లకు 364 పరుగులు చేసింది. టీమిండియా బ్యాట్స్ మెన్ ను నిలువరించేందుకు ఆఫ్ఘన్ కెప్టెన్ ఎనిమిది మంది బౌలర్లను రంగంలోకి దింపినా ప్రయోజనం లేకపోయింది. పరుగుల కోసం ఆవురావురుమంటున్న రోహిత్ శర్మ, రైనా, బ్యాట్లకు పని చెప్పారు. దీంతో, భారత్ 300 మార్కు అధిగమించింది. చివర్లో రహానే ధాటిగా ఆడడంతో భారత్ భారీ స్కోరు నమోదు చేసింది. అనంతరం, లక్ష్య ఛేదనకు ఉపక్రమించిన ఆఫ్ఘన్ 5 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టానికి 30 పరుగులు చేసింది. ఓపెనర్ జావెద్ అహ్మది (17) ఉమేశ్ యాదవ్ బౌలింగ్ లో వెనుదిరిగాడు. క్రీజులో ఉస్మాన్ ఘని (6 బ్యాటింగ్), నవ్ రోజ్ మంగళ్ (1 బ్యాటింగ్) ఉన్నారు.

  • Loading...

More Telugu News