: 14న ఢిల్లీ సీఎంగా కేజ్రీవాల్ ప్రమాణం... దీక్షల వేదిక రామ్ లీలా మైదానే వేదిక!
ఎన్నికల్లో ప్రత్యర్థులను మట్టికరిపించిన ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ మరోమారు ఢిల్లీ సీఎం పీఠంపై కూర్చోనున్నారు. ఈ నెల 14న ఆయన ఢిల్లీ ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేయనున్నారు. న్యూఢిల్లీ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థి నుపుర్ శర్మపై విజయం సాధించిన కేజ్రీవాల్, ఏడాది వ్యవధిలో రెండోసారి ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికయ్యారు. అంతేకాక తాజా మాజీ ముఖ్యమంత్రి హోదా నుంచి ఆయన ముఖ్యమంత్రి పదవిని దక్కించుకున్నారు. సీఎం పదవికి కేజ్రీవాల్ రాజీనామా చేసిన తర్వాత మరెవరకూ ఆ పీఠంపై కూర్చోలేదు. దీంతో ఏడాదిగా ఆయన తాజా మాజీ సీఎంగానే కొనసాగుతున్నారు. తాజాగా రెండోసారి పదవి చేపట్టనున్న కేజ్రీవాల్, దీక్షల వేదిక రామ్ లీలా మైదాన్ లో ప్రమాణ స్వీకారం చేయనున్నారు.