: 30 స్థానాల్లో ఆప్ విజయం, 35 చోట్ల ఆధిక్యం... బీజేపీ 2 చోట్ల గెలుపు
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆప్ దూసుకుపోతోంది. ఓట్ల లెక్కింపు ప్రక్రియ ముందుకు వెళ్లేకొద్దీ ఆమ్ ఆద్మీ పార్టీ గెలిచిన స్థానాల సంఖ్య పెరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం 70 అసెంబ్లీ స్థానాలకుగానూ ఆప్ 30 స్థానాల్లో విజయం సాధించింది. 35 చోట్ల ముందంజలో ఉంది. ఇక, బీజేపీ రెండు స్థానాల్లో గెలుపొంది, మరో 2 చోట్ల ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇతరులు ఒక స్థానంలో ఆధిక్యంలో కొనసాగుతున్నారు.