: చాలా చిన్న వాడిని, ఒక్కడినే ఏమీ చేయలేను... అందరం కలసి అద్భుతాలు చేద్దాం: కేజ్రీవాల్ పిలుపు
అందరం కలసికట్టుగా ఢిల్లీని ప్రపంచ స్థాయి నగరంగా అభివృద్ధి చేద్దామని, ఢిల్లీకి కాబోయే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ పిలుపునిచ్చారు. ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న తరుణంలో మొదటి సారిగా ఆప్ కార్యకర్తలతో కలసి ఆయన ఆనందాన్ని పంచుకున్నారు. ఈ క్రమంలో కార్యకర్తలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ విజయం ప్రజలది, నిజాయతీది అని తెలిపారు. నిజాయతీతో నడిస్తే ప్రపంచం మొత్తం సహకరిస్తుందని అన్నారు. తాను చాలా చిన్న వాడినని, ఒక్కడినే ఏమీ చేయలేనని... అందరూ సహకరిస్తేనే ఏమైనా సాధించగలమని చాలా వినమ్రంగా చెప్పారు. ప్రపంచం గర్వంచేలా ఢిల్లీని డెవలప్ చేద్దామని పిలుపునిచ్చారు.