: ఢిల్లీ ఫలితాలు వచ్చాయిగా, ఇక కాశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పాటు చేయండి: బీజేపీకి ఒమర్ సూచన
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాకే జమ్ము కాశ్మీర్ లో ప్రభుత్వం ఏర్పాటు చేస్తామన్న బీజేపీ మాటలను తాజాగా నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా గుర్తు చేశారు. ఈ మేరకు ట్విట్టర్ లో "డియర్ బీజేపీ, జేకేడీపీ జమ్ము కాశ్మీర్ లో ఇప్పటికైనా ప్రభుత్వం ఏర్పాటు చేస్తారా? ఢిల్లీ కోసం ఎదురుచూడమని చెప్పారు, మేము ఎదురుచూశాం. ఇకిప్పుడు ఎక్కువకాలం ఎదురుచూడాలని మేము అనుకోవడంలేదు" అని గుర్తు చేశారు. మరోవైపు ఢిల్లీలో ఆప్ భారీ విజయంపై ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. 'వెల్ డన్ ఆమ్ ఆద్మీ పార్టీ' అంటూ ప్రశంసించారు. ఐదు సంవత్సరాల పాటు సీఎంగా ఉండబోతున్న అరవింద్ కేజ్రీవాల్ కు గుడ్ లక్ అంటూ ఒమర్ అభినందనలు తెలిపారు. ఆప్ విజయం నేపథ్యంలో వారిపై పోరాడాలనుకుంటే కాంగ్రెస్, బీజేపీ, మోదీలు ముందు ముందు తప్పులు చేయకూడదని హితవు పలికారు.