: ఢిల్లీలో చీపురు ఖరీదు రూ.150 పైనే... ఆప్ కు సానుకూల పవనాలతో పెరిగిన ధరలు


దేశ రాజధాని ఢిల్లీలో గడచిన రెండు రోజుల నుంచి చీపుర్ల ధరలు విపరీతంగా పెరిగిపోయాయట. ఒక్కో చీపురు కోసం రూ. 150 పైగా వెచ్చించాల్సి వచ్చిందట. అయినా చీపుర్ల కోసం కొంతమంది పలు షాపులు తిరిగి మరీ కొనుగోలు చేశారు. ఎందుకంటే, ఈ నెల 7 న ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎగ్జిట్ పోల్స్ అన్నీ అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీదే విజయమని తేల్చేశాయి. ఈ నేపథ్యంలో, ఆ పార్టీ గుర్తుగా ఉన్న చీపురును చేతబట్టి సంబరాలు చేసుకునేందుకు పార్టీ కార్యకర్తలు, మద్దతుదారులు షాపులకు క్యూ కట్టారట. పరిస్థితిని గమనించిన షాపుల యజమానులు రూ.40 నుంచి రూ.60 మధ్య దొరుకుతున్న చీపుర్ల ధరలను ఒకేసారి మూడు రెట్లు పెంచేశారట. అయినా వెనుకాడని ఢిల్లీ ప్రజలు ఒక్కో చీపురు కోసం రూ.150కి పైగా వెచ్చించేందుకు కూడా వెనుకాడలేదట.

  • Loading...

More Telugu News