: పసికూన ఆఫ్ఘన్ పై రోహిత్ శర్మ సెంచరీ


రెండో వార్మప్ మ్యాచ్ లో భారత్ బ్యాటింగ్ ప్రాక్టీసు చేసుకుంటోంది. పసికూన ఆఫ్ఘనిస్తాన్ తో మ్యాచ్ లో 36 ఓవర్లు ముగిసేసరికి టీమిండియా స్కోరు 3 వికెట్లకు 237 పరుగులు. ఆఫ్ఘన్ బౌలర్లను ఆటాడుకుంటున్న రోహిత్ శర్మ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అడిలైడ్ లో జరుగుతున్న ఈ మ్యాచ్ లో కెప్టెన్ ధోనీ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ గా బరిలో దిగిన రోహిత్ ధాటిగా ఆడడంతో పరుగులు వెల్లువెత్తాయి. అతనికి సురేశ్ రైనా నుంచి సహకారం లభించింది. రైనా 75 పరుగులు చేసి రనౌటయ్యాడు. ధావన్ (4), కోహ్లీ (5) విఫలమయ్యారు. ప్రస్తుతం రోహిత్ శర్మ 126 పరుగులతో, రహానే 21 పరుగులతో ఆడుతున్నారు.

  • Loading...

More Telugu News