: ఆమ్ ఆద్మీకి మమతా బెనర్జీ శుభాకాంక్షలు
ఢిల్లీ ఫలితాల్లో భారీ విజయాన్ని సొంతం చేసుకోబోతున్న ఆమ్ ఆద్మీ పార్టీకి, మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్న అరవింద్ కేజ్రీవాల్ కు పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ శుభాకాంక్షలు తెలిపారు. "ఢిల్లీ ఎన్నికలను స్వీప్ చేస్తున్న ఆప్ కు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. కొత్త సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు ఆల్ ద బెస్ట్" అని తెలిపారు. "ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు ఢిల్లీ ఎన్నికలు ఓ టర్నింగ్ పాయింట్. ప్రజాస్వామ్యంలో రాజకీయ ప్రతీకారానికి చోటు లేదని తెలుస్తోంది. దేశానికి ఇటువంటి మార్పే అవసరం. ఢిల్లీలో ఇది ప్రజల విజయం. అహంకారులకు, కక్షపూరిత రాజకీయాలు చేస్తున్న వారికి, ప్రజలలో ద్వేషాన్ని వ్యాప్తి చేస్తున్న వారికి ఇది అతిపెద్ద పరాజయం" అని దీదీ ట్విట్ చేశారు.