: ఇది ప్రజా విజయం: కేజ్రీవాల్
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ భారీ ఆధిక్యంతో విజయాన్ని దక్కించుకోబోతుండటంపై ఆ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ సంతోషం వ్యక్తం చేశారు. ఇది ప్రజా విజయమని పేర్కొన్నారు. మరోవైపు, తన ట్విట్టర్ ఖాతాలోనూ ఆయన స్పందించారు. దేశంలో రాజకీయ విప్లవం ప్రారంభమైందంటూ ట్వీట్ చేశారు. ఢిల్లీలో వీఐపీ సంప్రదాయానికి చరమగీతం పాడతామన్నారు. త్వరలో దేశంలో సమూల మార్పులు చూస్తారని చెప్పారు. ఢిల్లీ పీఠం ఆప్ కు దక్కుతుందో లేదోనని తానెప్పుడూ ఉద్వేగానికి లోనుకాలేదన్న కేజ్రీ, రాజధాని ప్రజలు ఆప్ కే పట్టం కడతారని తనకు ముందునుంచి పూర్తి విశ్వాసం ఉందన్నారు.