: ఆ జాబితాలో మా పేర్లు లేవు... ఐసీఐజే జాబితాపై అంబానీ సోదరుల కలవరపాటు


స్విస్ బ్యాంకుల్లో మూలుగుతున్న నల్లధనానికి సంబంధించిన ఖాతాదారుల జాబితాపై భారత పారిశ్రామిక దిగ్గజాలు కలవరపాటుకు గురయ్యారు. దాదాపు లక్ష మంది నల్ల కుబేరులతో కూడిన భారీ జాబితాను ఇంటర్నేషనల్ కన్సార్టియం ఆఫ్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్స్ (ఐసీఐజే) నిన్న విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ జాబితాలో భారత్ కు చెందిన 1,195 మంది కూడా ఉన్నారని ఐసీఐజే ప్రకటించింది. ఈ జాబితా విడుదలైన మరుక్షణమే దేశీయ బడా పారిశ్రామికవేత్తల నుంచి మీడియాకు ప్రకటనలు వెల్లువెత్తాయి. నల్ల కుబేరుల జాబితాలో తమ పేర్లు లేవంటూ ముఖేశ్ అంబానీ, అనిల్ అంబానీలు తమ ప్రతినిధుల ద్వారా ప్రకటనలు విడుదల చేశారు. లార్డ్ స్వరాజ్ పాల్, నరేశ్ గోయల్, నారాయణ్ రాణే తదితర ప్రముఖులు కూడా జాబితాలో తమ పేర్లు లేవంటూ ప్రకటించారు.

  • Loading...

More Telugu News