: న్యూఢిల్లీ నియోజకవర్గంలో కేజ్రీవాల్ ఆధిక్యం... కృష్ణానగర్ లో బేడీ ముందంజ
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ప్రధాన ప్రత్యర్ధులుగా బరిలోకి దిగిన ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్, బీజేపీ సీఎం అభ్యర్థి కిరణ్ బేడీలు తమ తమ నియోజకవర్గాల్లో ముందంజలో కొనసాగుతున్నారు. న్యూఢిల్లీ అసెంబ్లీ సీటు నుంచి కేజ్రీవాల్ బరిలోకి దిగిన విషయం తెలిసిందే. గడచిన ఎన్నికల్లో ఆయన ఈ స్థానం నుంచే బరిలోకి దిగి, కాంగ్రెస్ సీనియర్ నేత, నాటి ఢిల్లీ సీఎం షీలా దీక్షిత్ ను మట్టి కరిపించారు. ఈ దఫా కూడా ఆయన ఓట్ల లెక్కింపు ఆరంభం నుంచే ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. ఇదిలా ఉంటే, బీజేపీ సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగిన కిరణ్ బేడీ కృష్ణా నగర్ స్థానం నుంచి పోటీ చేస్తున్నారు. తొలి ట్రెండ్స్ లో భాగంగా ఆమె తన ప్రత్యర్ధులపై ఆధిక్యం సాధించారు.