: మొదలైన ‘ఢిల్లీ’ ట్రెండ్స్... ఆప్ కార్యాలయం వద్ద కోలాహలం!
కొద్దిసేపటి క్రితం మొదలైన ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ లో తొలి 15 నిమిషాల్లోనే ట్రెండ్స్ వెలువడ్డాయి. మొదటి ట్రెండ్ లో భాగంగా బీజేపీ బోణీ కొట్టింది. రోహిణీ నియోజకవర్గం నుంచి బరిలోకి దిగిన ఆ పార్టీ అభ్యర్థి విజేందర్, తన ప్రత్యర్ధులపై పైచేయి సాధించారు. మరుక్షణమే ఆప్ కూడా తన సత్తా చాటుతూ ఒకేసారి రెండు చోట్ల ఆధిక్యం చూపింది. ఇక కాంగ్రెస్ పార్టీ కూడా ఓ స్థానంలో ఆధిక్యంలో ఉన్నట్లు ట్రెండ్స్ వెలువడ్డాయి. కౌంటింగ్ ప్రారంభమైన నేపథ్యంలో ఆప్ కార్యాలయం వద్ద కోలాహలం ప్రారంభమైంది. పార్టీ కార్యకర్తలు సంబరాలను ఆరంభించారు. పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.