: జీయోమీ ఎంఐ4 కు భారత్ లో భలే గిరాకీ... 2.5 లక్షల హ్యాండ్ సెట్ల కోసం ఆర్డర్లు!


చైనా మొబైల్ ఫోన్ల తయారీ దిగ్గజం జీయోమీ, భారత్ లో తన మార్కెట్ వాటాను క్రమంగా పెంచుకుంటోంది. తాజాగా ఎంఐ4 పేరిట ఆ సంస్థ విడుదల చేయనున్న కొత్త మొబైల్ ను కొనేందుకు ఇప్పటికే 2.5 లక్షల మంది భారతీయులు తమ పేర్లను నమోదు చేసుకున్నారట. గత నెల 28 నుంచి మొదలైన రిజిస్ట్రేషన్ నేటి అర్ధరాత్రితో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు లేకపోలేదు. చైనా యాపిల్ గా పేరుగాంచిన జియోమీ, ఐఫోన్ ను తలదన్నే స్మార్ట్ ఫోన్లను అతి తక్కువ ధరలకే అందిస్తున్న విషయం తెలిసిందే. తన తాజా మోడల్ ఎంఐ4 ధరను ఆ సంస్థ రూ.19,999గా నిర్ణయించింది.

  • Loading...

More Telugu News