: రామ్ చరణ్ కారు నెంబర్ టీఎస్ 09ఈఈ1111... ఫ్యాన్సీ నెంబర్ కోసం రూ.1.15 లక్షలు!


ఫ్యాన్సీ నెంబర్ల క్రేజ్ హైదరాబాదులో నానాటికీ పెరిగిపోతోంది. దీంతో తెలంగాణ రవాణా శాఖకు కాసుల పంట కురుస్తోంది. నిన్న నిర్వహించిన ఫ్యాన్సీ నెంబర్ల వేలంలో రూ.8.39 లక్షల ఆదాయం వచ్చిందని ఆ శాఖాధికారులు తెలిపారు. వేలంలో పాల్గొన్న టాలీవుడ్ యువహీరో, రాజ్యసభ సభ్యుడు చిరంజీవి తనయుడు రామ్ చరణ్ తేజ తన కొత్త కారు కోసం ఫ్యాన్సీ నెంబరును కొనుగోలు చేశాడు. రూ.1.14 కోట్లతో ఇటీవల కొనుగోలు చేసిన ల్యాండ్ క్రూయిజర్ కారు కోసం ‘టీఎస్ 09 ఈఈ 1111’ నెంబరును అతడు దక్కించుకున్నాడు. ఈ నెంబర్ కోసం రూ.1.15 లక్షలు వెచ్చించాడు.

  • Loading...

More Telugu News