: 43 శాతం ఫిట్ మెంట్ తో సంబరాల్లో ఏపీ ఉద్యోగులు... సెలవుల్లోనూ పనిచేస్తామన్న అశోక్ బాబు
తాము కోరుకున్నట్టుగా సర్కారు 43 శాతం ఫిట్ మెంట్ ను ప్రకటించడంతో ఏపీ ఉద్యోగులు సంబరాల్లో మునిగిపోయారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబునాయుడుకు మిఠాయిలు తినిపించిన ఉద్యోగులు... సీఎం, కేబినెట్ సబ్ కమిటీ మంత్రుల సమక్షంలోనే సంబరాలు జరుపుకున్నారు. రెవెన్యూ లోటు ఉన్నా, తెలంగాణ తరహాలోనే తమ ప్రభుత్వం కూడా 43 శాతం ప్రకటించడం పట్ల ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈ సందర్భంగా ఏపీఎన్జీఓ అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ ప్రభుత్వం ఆశించిన మేరకు పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. అవసరమైతే సెలవు రోజుల్లోనూ విధులకు హాజరయ్యేందుకు వెనుకాడబోమని ఆయన ప్రకటించారు.