: భారీ తెరపై ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: ఈసీ


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలను భారీ తెరపై ఎప్పటికప్పుడు ప్రదర్శించాలని ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు ఏర్పాట్లు కూడా చేసింది. అశోక్ రోడ్ లోని ఎన్నికల సంఘ ప్రధాన కార్యాలయం బయట ఈ తెరను ఏర్పాటు చేశారు. అదే విధంగా ఎన్నికల సంఘ అధికారిక వెబ్ సైట్ లోనూ ఫలితాలు ఎప్పటికప్పుడు ఉంచుతామని అధికారులు తెలిపారు. ఫలితాలతో పాటు ఫోటోగ్రాఫ్ లు కూడా అందుబాటులో ఉంచుతామని వారు వెల్లడించారు.

  • Loading...

More Telugu News