: 43 శాతం ఫిట్ మెంట్ కు అంగీకరించిన ఏపీ

ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త అందించింది. ఉద్యోగులకు 43 శాతం ఫిట్ మెంట్ ఇచ్చేందుకు అంగీకరించింది. 2014, జూన్ 2 నుంచి నూతన పీఆర్సీ అమలు చేయనున్నట్టు సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఆర్థిక సమస్యలున్నప్పటికీ ఉద్యోగుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన చెప్పారు. ఏపీ ఆదాయాన్ని పెంచుకోవాల్సిన అవసరముందని ఆయన అభిప్రాయపడ్డారు. ఆదాయం పెరిగేంతవరకు సహాయం చేయాలని కేంద్రాన్ని కోరినట్టు ఆయన వెల్లడించారు. కాగా, ప్రభుత్వం ఫిట్ మెంట్ పెంచడంపై ఏపీ ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి.