: వందకు పైగా దేశాల రాయబారులతో భేటీ కానున్న బాబు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రేపు ఉదయం ఢిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. వందకు పైగా దేశాల రాయబారులతో ఆయన సమావేశం కానున్నారు. ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులపై రాయబారులతో ఆయన చర్చించనున్నారు. పెట్టుబడుల కోసం పలు దేశాలు పర్యటించిన చంద్రబాబు అందివచ్చిన ఏ అవకాశం వదులుకోకూడదని భావిస్తున్నారు. దీంతో రాయబారుల సమావేశం సందర్భంగా, వారితో చర్చించి రాష్ట్రానికి పెట్టుబడులు ఆహ్వానించనున్నారు.