: 46,230 ఉద్యోగావకాశాలున్నాయి: జూపల్లి
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తరువాత 10 జిల్లాల్లో 5,280 కోట్ల రూపాయలతో పరిశ్రమలు ఏర్పాటవుతున్నాయని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. హైదరాబాదులో ఆయన మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ఐపాస్ ద్వారా 3,067 మైక్రో, 149 స్మాల్ పరిశ్రమల కోసం దరఖాస్తులు వచ్చాయని అన్నారు. చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు 15 రోజుల్లో అనుమతులు వస్తాయని ఆయన చెప్పారు. భారీ పరిశ్రమలకు 30 రోజుల్లో అనుమతులు ఇస్తామని అన్నారు. ఈ పరిశ్రమల్లో 46,230 ఉద్యోగాలు రానున్నాయని ఆయన పేర్కొన్నారు. పరిశ్రమల అనుమతుల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీలు తిరగాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. అనుమతుల కోసం దరఖాస్తులు చేసుకుంటే చాలు ఇస్తామని ఆయన తెలిపారు.