: మైనింగ్ కేసులో జరిమానా చెల్లించండి... డీకే అరుణ భర్తకు కోర్టు ఆదేశం
మాజీ మంత్రి, కాంగ్రెస్ నాయకురాలు డీకే అరుణ భర్త, కాంగ్రెస్ నేత భరతసింహారెడ్డి అక్రమ మైనింగ్ కు హైకోర్టు చెక్ పెట్టింది. అక్రమ తవ్వకాలు ఆపాలని ఆదేశించింది. మైనింగ్ కేసుకు సంబంధించి అధికారులు విధించిన రూ.32 కోట్ల జరిమానాను చెల్లించాలని ఆదేశించింది. మహబూబ్ నగర్ జిల్లా ధరూర్ మండలం మన్నూరులో ఆయన అక్రమ మైనింగ్ కు పాల్పడుతున్నట్టు దాఖలైన వ్యాజ్యంపై కోర్టు నిన్న (సోమవారం) ఉత్తర్వులు జారీ చేసింది. వెంటనే నిలిపివేయాలని ఆదేశాలిచ్చింది. ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని అధికారులను ఉత్తర్వులో కోర్టు ఆదేశించింది.