: అక్కడ అబ్బాయి పుడితే కుమిలిపోతారు!


భారత్ లో అమ్మాయి పుడితే బాధపడడం, అబ్బాయి పుడితే సంబరాలు చేసుకోవడం చాలా చోట్ల సాధారణంగా కనిపించే విషయం. కానీ, మనదేశంలోనే ఓ ప్రాంతంలో మాత్రం ఇందుకు విరుద్ధంగా జరుగుతుంది. మధ్యప్రదేశ్ లోని నోమదిక్ తెగలో మగపిల్లాడు పుడితే దిగులుపడతారు. అదే, అమ్మాయి పుడితే మాత్రం సంబరాలే! అందుకు బలమైన కారణమే ఉంది. నోమదిక్ తెగలో వ్యభిచారం ప్రధానవృత్తి. ఆడపిల్ల పుడితే ఆర్థికంగా లాభసాటి అని ఆలోచిస్తారు. అబ్బాయి అయితే ఉపయోగం ఉండదన్నది వారి భావన. రోడ్ల పక్కన గుడారాల్లో నివసించే వీరు ఎంత ఎక్కువ ఆడ సంతానం ఉంటే అంత మంచిదని అనుకుంటారు. గర్భంలో ఉన్నది మగశిశువు అని తెలిస్తే అబార్షన్లకు సిద్ధపడతారట. ఇక, కుమార్తెలు లేని దంపతులు దత్తత ద్వారానో, కొనుగోలు చేసో అమ్మాయిలను తెచ్చుకుంటారట. ప్రస్తుతం నోమదిక్ తెగలోనూ కొంత చైతన్యం వచ్చిందని సామాజికవేత్తలు అంటున్నారు. తెగలోని మహిళలు తమ కుమార్తెలను చదివించేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారని తెలిపారు. వారిలో కొందరు మెడిసిన్ చదువుతున్న వారు కూడా ఉన్నారట.

  • Loading...

More Telugu News