: ఎన్నికల్లో అభ్యర్థుల ఖర్చు, నగదు సీజ్ పై ఈసీని ప్రశ్నించిన హైకోర్టు


ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఖర్చుకు సంబంధించి హైకోర్టులో ఈరోజు విచారణ జరిగింది. నామినేషన్ల సమయంలో ఖర్చుకు సంబంధించి కేంద్రం, ఈసీ అఫిడవిట్ దాఖలు చేయకపోవడంపై విచారణ జరిపింది. అఫిడవిట్ ఎందుకు దాఖలు చేయడం లేదని కోర్టు ప్రశ్నించింది. వారంలోగా కౌంటరు దాఖలు చేయాలని ఆదేశించింది. ఎన్నికల సమయంలో అసలు ఎంత నగదును సీజ్ చేశారని ధర్మాసనం అడిగింది. ఎన్నికల్లో గెలిచిన అభ్యర్థులు విజయోత్సవాలకు ఎంత ఖర్చు చేస్తున్నారన్న దానిపై అడిగిన కోర్టు, వెంటనే ఈ ఖర్చుపై ఆరా తీయాలని ఈసీకి హైకోర్టు సూచించింది.

  • Loading...

More Telugu News