: కేసీఆర్ కుటుంబం తెలంగాణకు పీడలా తయారైంది!: టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ


తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుపై టీడీపీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు ఎల్.రమణ ధ్వజమెత్తారు. కేసీఆర్ కుటుంబం తెలంగాణ రాష్ట్రానికి పీడలా తయారైందని విమర్శించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే ఎర్రగడ్డ ఛాతీ ఆసుపత్రిని తరలించాలన్న నిర్ణయం తీసుకున్నారని ఆరోపించారు. అటు, సచివాలయం, ఛాతీ ఆసుపత్రి తరలింపును టీడీపీ వ్యతిరేకిస్తోందని తెలిపారు. కేసీఆర్ పాలనలో రాష్ట్రంలోని అన్ని వర్గాలు ఇక్కట్ల పాలవుతున్నాయని తెలిపారు. ఇక, తెలంగాణ ద్రోహులను టీఆర్ఎస్ లో చేర్చుకోవడాన్ని రమణ తప్పుబట్టారు. ఎర్రగడ్డలోని ఛాతీ ఆసుపత్రిని వికారాబాద్ తరలించాలని, సచివాలయాన్ని ఎర్రగడ్డలో నిర్మించాలని కేసీఆర్ సర్కారు యోచిస్తున్న సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News