: విండీస్ పై ఇంగ్లాండ్ ఘనవిజయం


ప్రపంచకప్ సన్నాహక మ్యాచ్ లు రసవత్తరంగా సాగుతున్నాయి. వరల్డ్ కప్ హాట్ ఫేవరేట్స్ గా బరిలో దిగుతున్న జట్లు సత్తా చాటుతున్నాయి. సొంతగడ్డపై ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ జట్లు ఫేవరేట్లుగా పరిగణించబడుతుండగా, ఇంగ్లండ్ జట్టు కూడా టైటిల్ ఆశలకు తగ్గ ఆటతీరు ప్రదర్శిస్తోంది. వార్మప్ మ్యాచుల్లో భాగంగా ఇంగ్లండ్, వెస్టిండీస్ జట్లు సిడ్నీలో తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ప్రారంభించిన విండీస్ జట్టు కేవలం 122 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఇంగ్లండ్ కేవలం 22.5 ఓవర్లలో ఒక వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఇంగ్లండ్ ఓపెనర్లు ఇయాన్ బెల్ (35), మొయిన్ అలీ (46) పరుగులు చేసి జట్టుకు శుభారంభం ఇవ్వగా, జేమ్స్ టేలర్ (25) మ్యాచ్ ను ముగించాడు.

  • Loading...

More Telugu News