: బీహార్ గవర్నర్ ను కలసిన నితీశ్ కుమార్
బీహార్ గవర్నర్ కేసరి నాథ్ త్రిపాఠిని జేడీ (యూ) నేత, మాజీ సీఎం నితీశ్ కుమార్ కలిశారు. అసెంబ్లీలో తనకు 130 మంది ఎమ్మెల్యేల మెజార్టీ ఉందని, కాబట్టి రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరారు. నితీశ్ వెంట జేడీ(యూ) అధ్యక్షుడు శరద్ యాదవ్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ లు కూడా వున్నారు. గవర్నర్ తో సంతృప్తికరంగా చర్చలు సాగాయని అనంతరం మీడియాతో శరద్ చెప్పారు. నితీశ్ ను నూట ముప్పై మంది ఎమ్మెల్యేలు బలపరుస్తున్నారన్నారు. నితీశ్ సీఎం బాధ్యతలు తీసుకోవాలని లాలూ అన్నారు.