: భారత్ పేలవంగా ఆడుతోంది... పాక్ కు సువర్ణావకాశం: జహీర్ అబ్బాస్
వరల్డ్ కప్ లో భారత్ పై నెగ్గేందుకు పాకిస్థాన్ కు ఇదే మంచి సమయమని బ్యాటింగ్ దిగ్గజం జహీర్ అబ్బాస్ అంటున్నాడు. ఆసీస్ పర్యటనలో టీమిండియా ఆటతీరు చూసిన తర్వాత తాను ఈ అభిప్రాయానికి వచ్చినట్టు తెలిపాడు. వరల్డ్ కప్ చరిత్రలో భారత్ పై పాకిస్థాన్ ఇప్పటివరకు నెగ్గిందిలేదు. "ఈసారి పాక్ ముందు సువర్ణావకాశం నిలిచింది. నిన్నటి ప్రాక్టీసు మ్యాచ్ సహా ఆస్ట్రేలియాలో టీమిండియా ప్రదర్శనను చూసిన అనంతరం ఈ అభిప్రాయానికొచ్చాను" అని అబ్బాస్ పేర్కొన్నాడు. పాకిస్థాన్ తో పోల్చితే, డిఫెండింగ్ చాంప్ హోదాలో టోర్నీలో అడుగుపెడుతున్న భారత్ పైనే అధిక ఒత్తిడి ఉంటుందని విశ్లేషించాడు.