: ఏపీకి అదనంగా వెంకయ్యనాయుడు ఏం తెచ్చారో చెప్పాలి: సి.రామచంద్రయ్య
కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడిపై కాంగ్రెస్ నేత సి.రామచంద్రయ్య మండిపడ్డారు. విభజన బిల్లులోవి తప్ప అదనంగా వెంకయ్యనాయుడు ఏపీకి ఏమైనా తెచ్చారా? అని ప్రశ్నించారు. వ్యంగం, వాక్చాతుర్యంతో వాస్తవాలను మరుగుపర్చాలని వెంకయ్య చూస్తున్నారని ఆరోపించారు. రాష్ట్రాన్ని విభజించామని ఎన్నికల్లో తమపై కోపం చూపిన ప్రజలు కోటి సంతకాల సేకరణను ఆదరిస్తున్నారని చెప్పారు. అయితే విభజన బిల్లులో అసమానతలు నిజమేనని రామచంద్రయ్య ఒప్పుకున్నారు. బిల్లులో లోపాలున్నాయంటున్న సీఎం చంద్రబాబు... అప్పుడే కేంద్రానికి ఎందుకు చెప్పలేదని సూటిగా ప్రశ్నించారు. అసెంబ్లీలో చర్చ జరిగితే కూడా బాబు ఎందుకు పాల్గొనలేదన్నారు.