: అమ్మానాన్నల ఎదుటే పెళ్లి చేస్తాం.... వీహెచ్ పీ 'ప్రేమికుల రోజు' హెచ్చరిక


'వాలెంటైన్స్ డే' రాక కోసం ప్రపంచదేశాలకు చెందిన యువతీయువకులు ఎదురుచూస్తున్నారు. అయితే, భారత్ లో మాత్రం ఆందోళనకర వాతావరణ నెలకొంది. ఫిబ్రవరి 14న బయట కనిపించే ప్రేమికులను పట్టుకుని వివాహం చేస్తామని హిందుత్వ సంస్థలు హెచ్చరికలు జారీచేయడమే అందుకు కారణం. తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ ధోరణి ప్రబలంగానే ఉంది. ప్రేమికుల రోజున సంప్రదాయ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకోబోమని హెచ్చరించారు. ఆ రోజున పబ్ లు, రిసార్టులు, హోటళ్లలో ప్రత్యేక ఈవెంట్లు నిర్వహించరాదని అన్నారు. ప్రేమికుల తల్లిదండ్రులను పిలిపించి, వారి ఎదుటే వివాహం చేస్తామని వీహెచ్ పీ నేతలు రామరాజు, వెంకటేశ్వరరాజు స్పష్టం చేశారు.

  • Loading...

More Telugu News