: అంతా కేసీఆర్ దయ: ఎమ్మెల్యే గాదరి
తనకు లభించిన ఈ పదవి తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు దయతో లభించిందని తుంగతుర్తి టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గాదరి కిషోర్ వ్యాఖ్యానించారు. పార్లమెంటరీ కార్యదర్శిగా ఆయన నేడు బాధ్యతలు స్వీకరించారు. మంత్రులు ఈటెల రాజేందర్, జగదీష్ రెడ్డి, లక్ష్మారెడ్డి తదితరులు ఈ సందర్భంగా కిషోర్ కు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తాను ఈ స్థాయికి రావడం వెనుక కేసీఆర్ మార్గనిర్దేశకత్వం ఎంతగానో ఉపయోగపడిందని కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయనని స్పష్టం చేశారు. బంగారు తెలంగాణ కోసం తనవంతు కృషి చేస్తానని చెప్పారు.