: అధిష్ఠానం ఆత్మవిమర్శ చేసుకోవాలి: కాంగ్రెస్ కు సీనియర్ నేత మాకెన్ సూచన


వరుస పరాజయాలు, కీలక నేతల వీడ్కోలుతో సతమతవుతున్న కాంగ్రెస్ అధిష్ఠానంపై మరో నిరసన గళం విరుచుకుపడింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ సీఎం అభ్యర్థిగా బరిలోకి దిగిన ఆ పార్టీ అధికార ప్రతినిధి అజయ్ మాకెన్ ఈసారి అధిష్ఠానంపై విమర్శలు చేశారు. ఇంకా ఎన్నికల ఫలితాలు వెలువడకముందే, ఆయన గళమెత్తడం గమనార్హం. ఒపీనియన్ పోల్స్, ఎగ్జిట్ పోల్స్ నిజమైతే, అధిష్ఠానం తప్పనిసరిగా ఆత్మ విమర్శ చేసుకోవాలని ఆయన కొద్దిసేపటి క్రితం వ్యాఖ్యానించారు. ఒపీనియన్ పోల్స్ తో పాటు ఎన్నికల అనంతర వెలువడ్డ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్ కు 5 స్థానాలకు మించి దక్కవని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News