: జగన్ అక్రమాస్తుల కేసులో 'ఇందూ' ఆస్తుల తాత్కాలిక జప్తు
వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఇందూ గ్రూప్ ఆస్తులను ఈడీ తాత్కాలిక జప్తు చేసింది. 'ఇందూ' శ్యాంప్రసాద్ రెడ్డికి చెందిన రూ.53 కోట్ల విలువైన ఆస్తులు జప్తు చేశారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం మామిడిపల్లిలో ఇందూ టెక్నాలజీస్ కు చెందిన 153 ఎకరాల భూమి, జీడిమెట్లలో వాల్డన్ ప్రాపర్టీస్ కు చెందిన రూ.3 కోట్ల విలువైన భూమి, ఎస్పీఆర్ ప్రాపర్టీస్ కు చెందిన వంద ఎకరాల భూమిని తాత్కాలికంగా జప్తు చేశారు.