: అమెరికాలో దారుణం... మాజీ భార్యను, ప్రియుడిని కాల్చి, ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి
అమెరికాలోని అట్లాంటాకు సమీపంలో దారుణం జరిగింది. క్షణికావేశమో లేక ఉన్మాదమో, ఒక వ్యక్తి ఆరుగురిపై కాల్పులు జరిపాడు. మాజీ భార్య, ఆమె ప్రియుడితో పాటు తన ఇద్దరు కుమార్తెలపై, మరో ఇద్దరు చిన్నారులపై సెడ్రిక్ ఫ్రాథర్ అనే వ్యక్తి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు, మాజీ భార్య, ఆమె ప్రియుడు మరణించారని, తీవ్రంగా గాయపడిన మరో ఇద్దరు పిల్లలకు ఆసుపత్రిలో చికిత్స అందుతోందని పోలీసులు తెలిపారు. తీవ్ర ఆగ్రహంతో తుపాకితో వచ్చిన సెడ్రిక్ తన సొంత కుమార్తెను వీధుల్లో తరుముతూ కాల్చడాన్ని చుట్టుపక్కల వారు చూశారు. అనంతరం, అతను కూడా అదే తుపాకితో కాల్చుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతదేహాలను స్వాధీనం చేసుకుని, ఘటన పూర్వాపరాలు పరిశీలిస్తున్నట్టు పోలీసులు వివరించారు.