: నాకు తెలియకుండా నా ఇలాకాలో అడుగుపెడితే ఊరుకోను: మాజీ డిప్యూటీ సీఎం రాజయ్య


అవినీతి ఆరోపణల నేపథ్యంలో కేబినెట్ నుంచి బర్తరఫ్ కు గురైన తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం, స్టేషన్ ఘన్ పూర్ ఎమ్మెల్యే రాజయ్య కొద్దిసేపటి క్రితం కీలక వ్యాఖ్యలు చేశారు. తన అనుమతి లేకుండా, తనకు తెలియకుండా, తన నియోజకవర్గంలోకి ఏ నేత అడుగుపెట్టినా సహించబోనని ఆయన వ్యాఖ్యానించారు. స్టేషన్ ఘన్ పూర్ లో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాలుపంచుకున్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తనపై వచ్చిన అవినీతి ఆరోపణలు అవాస్తవమని, విచారణలో కడిగిన ముత్యంలా బయటకొస్తానని ఆయన పునరుద్ఘాటించారు. నిరాధార ఆరోపణల కారణంగా తనను పదవి నుంచి తప్పించడంపై నియోజకవర్గ ప్రజలు బాధపడుతున్నారని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News