: పొన్నాలకు మాజీ సీఎం కిరణ్ పరామర్శ... ఫోన్ చేసి పలకరింపు


నిరసన ప్రదర్శనలో చేయి బెణికి నిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న టీపీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్యకు పరామర్శలు వెల్లువెత్తుతున్నాయి. పట్టింపులను పక్కనబెట్టిన వివిధ పార్టీల నేతలు నిమ్స్ కు వచ్చి పొన్నాలను పరామర్శిస్తున్నారు. అయితే, ఉమ్మడి రాష్ట్రానికి చివరి సీఎంగా చరిత్రకెక్కిన నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి పొన్నాలకు ఫోన్ చేసి పరామర్శించారు. రాష్ట్ర విభజన, సార్వత్రిక ఎన్నికల్లో సొంత పార్టీ ఘోర పరాజయం నేపథ్యంలో దాదాపుగా అజ్ఞానంలోకి వెళ్లినట్లుగా వ్యవహరిస్తున్న కిరణ్, పొన్నాలకు ఫోన్ చేయడం గమనార్హం. ఇటీవల కేబీఆర్ పార్కు వద్ద నిత్యానందరెడ్డిపై కాల్పుల సందర్భంగా వాకింగ్ కు వచ్చి అందరి దృష్టిని ఆకర్షించిన నల్లారి, మళ్లీ వార్తల్లో కనిపించడం ఇదే తొలిసారి.

  • Loading...

More Telugu News