: గ్రామీ వేదికపై భారతీయుల సత్తా... అవార్డులు అందుకున్న రిక్కీ కేజ్, నీలా వస్వాని
ప్రతిష్ఠాత్మక 'గ్రామీ' అవార్డుల వేదికపై భారత్ మెరిసింది. 57వ గ్రామీ అవార్డుల ప్రదానోత్సవం నేడు జరుగగా 'విండ్స్ అఫ్ సంసార' ఆల్బమ్ ను సౌత్ ఆఫ్రికా సంగీత దర్శకుడు వుటర్ కెల్లెర్ మాన్ తో కలసి రూపొందించిన రిక్కీ కేజ్ 'బెస్ట్ న్యూ ఏజ్ ఆల్బమ్' విభాగంలో విజేతగా నిలిచాడు. 'బెస్ట్ చిల్డ్రన్ ఆల్బమ్' విభాగంలో "ఐ యామ్ మలాలా: హౌ వన్ గర్ల్ స్టుడ్ అప్ ఫర్ ఎడ్యుకేషన్ అండ్ చేంజ్ డ్ ది వరల్డ్" ఆల్బమ్ కు నీలా వస్వాని అవార్డును అందుకున్నారు. కాగా, 'బెస్ట్ వరల్డ్ మ్యూజిక్ ఆల్బమ్' విభాగంలో దివంగత సితార్ విద్వాంసుడు పండిట్ రవి శంకర్ కుమార్తె అనౌష్క రూపొందించిన ఆల్బమ్ 'ట్రేసెస్ అఫ్ యు' తుదిపోరులో ఉన్నప్పటికీ, విజేతగా నిలవలేదు.