: తెలంగాణ తెలుగుయువత అధ్యక్షుడిగా దేవేందర్ గౌడ్ కుమారుడు


తెలంగాణ తెలుగుయువత అధ్యక్షుడిగా టీటీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేందర్ గౌడ్ నియమితులయ్యారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో చేవెళ్ల లోక్ సభ స్థానం నుంచి పోటీచేసిన వీరేందర్ ఓటమిపాలయ్యారు. గత కొంత కాలంగా అనారోగ్య కారణాలతో దేవేందర్ గౌడ్ యాక్టివ్ పాలిటిక్స్ కు దూరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, ఆయన వారసుడు తెలంగాణ టీడీపీలో కీలక పాత్ర పోషించబోతుండటం గమనార్హం. ఇప్పటికే వీరేందర్ గౌడ్ టీడీపీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు.

  • Loading...

More Telugu News