: నిమ్స్ లో పొన్నాలను పరామర్శించిన ఎర్రబెల్లి
హైదరాబాదులోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న టీ.పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను టీ.టీడీపీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు పరామర్శించారు. అనవసర పోకడలకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి ప్రజలే బుద్ధి చెబుతారని విమర్శించారు. రెండు రోజుల కిందట నగరంలో నిర్వహించిన 'ఛలో రాజ్ భవన్' పాదయాత్ర ఆందోళనలో పొన్నాల గాయపడటంతో ఎడమచేయి బెణికింది. ఇప్పటికే కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్, పలువురు పార్టీ నేతలు ఆయనను పరామర్శించారు.