: పాక్ తో పోరుకు ఎవరిని ఎంచుకోవాలి?... డైలమాలో ధోనీ
వరల్డ్ కప్ లో పాకిస్థాన్ తో మ్యాచ్ కు తుది జట్టు ఎంపిక కెప్టెన్ ధోనీకి తలనొప్పిగా మారింది. ఆసీస్ తో సన్నాహక మ్యాచ్ కూడా ఓడిపోవడంతో కష్టాలు మరింత పెరిగాయి. తొలి మ్యాచే పాక్ తో ఆడాల్సి రావడంతో ధోనీ ఇప్పుడు డైలమాలో పడ్డాడు. ఆసీస్ పర్యటనలో ఒక్క మ్యాచ్ కూడా నెగ్గలేకపోయిన నేపథ్యంలో, వరల్డ్ కప్ లో మ్యాచ్ లు గెలిపించే ఆటగాళ్లెవరన్నది తేల్చుకోలేకపోతున్నాడు. ఆసీస్ తో వార్మప్ మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడుతూ, "జట్టు ఎంపిక చాలా క్లిష్టంగా మారింది. బ్యాట్స్ మెన్ క్లిక్కయితే బౌలర్లు చేతులెత్తేస్తున్నారు... బౌలర్లు రాణిస్తే... బ్యాట్స్ మెన్ విఫలమవుతున్నారు. ఈ సమస్యకు పరిష్కారం వెతకాల్సి ఉంది. పాక్ తో మ్యాచ్ కు ముందు మరో వార్మప్ మ్యాచ్ ఉండడం లాభించే అంశం" అని పేర్కొన్నాడు. పాకిస్థాన్ తో మ్యాచ్ ఈ నెల 15న జరగనుంది.