: ఇద్దరు చంద్రులూ కీలుబొమ్మలే: 'విరసం' సభ్యుడు కల్యాణరావు


ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కె.చంద్రశేఖరరావులు కార్పొరేట్‌ సంస్థలు, పెట్టుబడిదారుల చేతిలో కీలుబొమ్మలని విప్లవ రచయితల సంఘం (విరసం) సభ్యుడు కల్యాణరావు విమర్శించారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో జరుగుతున్న విరసం సభల్లో పాల్గొనేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ, కేసీఆర్‌, చంద్రబాబు ఒకే తానులోని ముక్కలని ఆయన అన్నారు. తెలుగు రాష్ట్రాలను పెట్టుబడిదారులే పరోక్షంగా పాలిస్తున్నారని కల్యాణరావు దుయ్యబట్టారు. రాజధాని పేరుతో చంద్రబాబు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు.

  • Loading...

More Telugu News