: దమ్ముంటే ఉప ఎన్నికలు పెట్టు... ప్రజలు నీకే సినిమా చూపిస్తారు: కేసీఆర్ పై సబిత ఫైర్
తెలంగాణ సీఎం కేసీఆర్ పై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ధ్వజమెత్తారు. నిన్న చేవెళ్లలో మీడియాతో మాట్లాడిన సబిత, ఉప ఎన్నికలపై కేసీఆర్ సర్కారు నాన్చుడు వైఖరిని ఎండగట్టారు. ఇతర పార్టీలను బలహీనపరచేందుకు కేసీఆర్ ఆకర్ష్ మంత్రాన్ని జపిస్తున్నారని ఆమె ఆరోపించారు. ‘‘దమ్ము, ధైర్యం ఉంటే ఉప ఎన్నికలు నిర్వహించు. ప్రజలు నీకు సినిమా చూపిస్తారు!’’ అని ఆమె కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఇతర పార్టీల టికెట్లపై ఎమ్మెల్యేలుగా గెలిచి టీఆర్ఎస్ లో చేరిన నేతలతో కేసీఆర్ తక్షణమే రాజీనామా చేయించి, సదరు స్థానాలకు ఉప ఎన్నికలు నిర్వహించాలని ఆమె డిమాండ్ చేశారు.